Header Banner

మనిషి మాంసాన్ని తినే పండు! మనం రోజూ దాన్ని తింటాం! అది ఏంటో తెలుసా?

  Thu Feb 27, 2025 16:31        Health

సాధారణంగా పండ్లు సమతుల్య ఆహారంలో కీలకమైన భాగం. ఎందుకంటే ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఏడాది పొడవునా లభించే, చౌకగా, పోషకాలకు సమృద్ధిగా ఉండే పండ్లు స్థానిక మార్కెట్‌లలో విరివిగా దొరుకుతాయి. వాటిలో ఒక ముఖ్యమైన పండు అనగా అనాసపండు (పైనాపిల్). మన దేశంలో ఈ పండు సంతల దగ్గర నుంచి సూపర్ మార్ట్‌లల్లో దొరుకుతుంది. చాలా మంది ఇష్టపడే ఈ పండు ఉష్ణమండల పండు. పైనాపిల్ తీపి, పుల్లని రుచి కలగి ఉండ ప్రత్యేకమైన పండు. 

 

ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషక సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉండే ఎంజైమ్‌పు పుష్కలంగా ఉంటాయి. అవే కాదు పైనాపిల్ గురించి ఎవరికి తెలియని వాస్తవాలు చాలానే ఉన్నాయి. పైనాపిల్ దక్షిణ్ అమెరికాకు చెందినదని చాలా మందికి తెలియదు. వీటిని అనేక శతాబ్దాలుగా అక్కడ పండిస్తున్నారు. పైనాపిల్ గురించి తెలియని మరో వాస్తవం ఏంటంటే.. మానవ మాంసం తినే పండు అని పిలుస్తారు. పైనాపిల్లో సిట్రిక్ యాసిడ్‌తో పాటు మాలిక్ యాసిడ్ ఉంటుంది. 

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

వీటివల్లే నాలుకపై జలదరింపు కలుగుతుంది. అలాగే పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఇది కాండం, ఆకులు, పైనాపిల్ పండు అంతటా ఉంటుంది. బ్రోమెలైన్ అనేది ఒక ప్రత్యేక రకమైన ప్రోటీన్. ఇది ఇతర ప్రోటీన్లను ఆమ్లాలుగా, నిజం చెప్పాలంటే జంతు ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. అంటే శరీరంలోని ప్రోటీన్లను చాలా త్వరగా విచ్చిన్నం చేస్తుంది. అందుకే దీనిని మానవ మాంసం తినే పండు అని పిలుస్తారు. పైనాపిల్ పొడిని మీట్ పరిశ్రమల్లో మాంసాన్ని మృదువుగా చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు బరువు తగ్గుతారు. 

 

వీటిలో విటమిన్ ఎ, కె మరియు ఫాస్పరస్, కాల్షియం, జింక్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. ఇది వ్యాధులతో పోరడటానికి సహాయపడుతుంది. పైనాపిల్‌ను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. పైనాపిల్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడంతో పాటు కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరచడంలోనూ తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.

 

ఇది కూడా చదవండి
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!  

 

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 

 

గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!  

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!  

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Health #Foods #Diet #Fruits #PineApple